మహిళని చంపి ఆ డెడ్‌బాడీతో 350 కి.మీ. ప్రయాణం

మహారాష్ట్రలో దారుణ ఘటన జరిగింది. మరొకరితో సంబంధముందన్న అనుమానంతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న మహిళను గొంతు నులిమి చంపాడు. హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కొల్హాపూర్ జిల్లాలోని షిర్గావ్ గ్రామానికి చెందిన ప్రకాష్ ఆనంద్ పాటిల్ (40) ఆదివారం తన పొలంలో సురేఖ శివాజీనే ఆరే (40)ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. తరువాత మృతదేహాన్ని కారులో 350 కి.మీ. దూరంలోని థానే జిల్లా భివండీలోని కషెలికి తరలించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



