రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన MLA

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం ఎస్.టి. మాకివలస, జమినివలస గ్రామాల్లో ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో భాగంగా నూతన రహదారి నిర్మాణ పనులను నరసన్నపేట MLA బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతులతో పాటు రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. సురక్షితమైన, నాణ్యమైన రహదారులు గ్రామాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కీలకమని చెప్పారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించారు.



