చిన్నారులపై లైంగికదాడి.. ఆర్.వీరమణి అరెస్ట్

తమిళనాడుకు చెందిన బిజినెస్ మ్యాన్ ఆర్.వీరమణిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించి POCSO కేసులో ఈ అరెస్ట్ జరిగింది. వీరమణితోపాటు అతని ఇద్దరు హెల్పర్స్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2025లో పోలీసులకు అందిన పెన్‌డ్రైవ్‌లోని వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వీరమణి ఇంట్లో మరికొందరు మైనర్ బాలికలు కూడా బాధితులై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.



