ఇండియాపై జెఫ్రీ సాచ్స్ బిగ్ ప్రిడిక్షన్

రాబోయే 25 ఏళ్లలో భారత్ ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఉందని అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ అన్నారు. వరల్డ్ ఆర్థిక వ్యవస్థ కేంద్రం ఆసియా వైపు మారుతోందని తెలిపారు. ఇండియా, చైనా ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా నిలిచే అవకాశం ఉందని, ఆ సమయంలో అమెరికా 3వ స్థానానికి వెళ్లొచ్చని చెప్పారు. ఈ శతాబ్దంలో భారత్ వరల్డ్‌లోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారొచ్చన్నారు.



