← Back to news

కలెక్టరేట్ వద్ద కాంట్రాక్ట్ టీచర్ల ధర్నా

By DK· 1h ago
కలెక్టరేట్ వద్ద కాంట్రాక్ట్ టీచర్ల ధర్నా

అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద Art, Craft, PET కాంట్రాక్ట్ టీచర్లు తమను రెగ్యులర్ చేయాలని ధర్నా నిర్వహించారు. 2012 నుంచి సమగ్ర శిక్ష ద్వారా ప్రభుత్వ, ZP, మున్సిపల్ హైస్కూళ్లలో పనిచేస్తున్న తమను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని కోరారు. MTS ప్రకారం SGT స్కేల్ 32,670 చెల్లించాలని, HR పాలసీ అమలు చేయాలని, రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. EPF, హెల్త్ కార్డు, సంక్షేమ పథకాలు అమలుచేయాలని కోరారు.

More in Local