ఏలేరు జలాశయంలో చేప పిల్లల విడుదల

కాకినాడ జిల్లా ఏలేరు జలాశయంలో మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచే లక్ష్యంతో 38 లక్షల మేలురకం చేప పిల్లలను విడుదల చేశారు. MLA వరుపుల సత్యప్రభ చేతులమీదుగా చేపపిల్లలను జలాశయంలో వదిలారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని ప్రభుత్వ మత్స్య విత్తన క్షేత్రాల్లో తయారైన చేపపిల్లలను జలాశయంలో విడుదల చేసినట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. చేపల పెంపకంతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతోపాటు స్థానికులకు ప్రోటీన్ ఆహారం అందుబాటులోకి వస్తుందన్నారు.



