← Back to news

పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

By DK· 18h ago
పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

పొదిలి మున్సిపాలిటీలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వైద్యులు కార్మికుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. అనంతరం పారిశుధ్య నిర్వహణలో మెరుగైన పనితీరు కనబరిచి, విధుల పట్ల అంకితభావంతో సేవలందించిన ముగ్గురు కార్మికులను అధికారులు సన్మానించారు. కార్మికులు తమ ఆరోగ్యంపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

More in Local