← Back to news

రైతులకు విద్యుత్ కోతలు వద్దు!

By Bejjanki· 14h ago· Bejjanki, Bejjanki, Siddipet
రైతులకు విద్యుత్ కోతలు వద్దు!

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో వ్యవసాయ విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం. బీజేపీ మండల అధ్యక్షుడు కొలిపాక రాజు ఆధ్వర్యంలో విద్యుత్ అధికారికి వినతిపత్రం అందజేశారు. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ, వరి పంట కీలక దశలో ఉందని, విద్యుత్ అంతరాయాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వరి కోత వచ్చే వరకు నిరంతర విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

More in Local