← Back to news

సమానత్వమే హక్కు.. కుల వివక్షకు చోటులేదు

By Thukaram Anumula· 10h ago
సమానత్వమే హక్కు.. కుల వివక్షకు చోటులేదు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మనూర్ మండలం కమలాపూర్ గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం జరిగింది. డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో జీవించాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు తెలుసుకుని పరిరక్షించుకోవాలన్నారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా పరస్పర గౌరవంతో గ్రామాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్, ఆర్ఐ, పోలీస్ శాఖ, గ్రామ పెద్దలు అనుముల మారుతి బాలాజీ పటేల్ పాల్గొన్నారు.

సమానత్వమే హక్కు.. కుల వివక్షకు చోటులేదు

More in Local