తగ్గిన పత్తి మిర్చి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,500, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,300, అటు క్వింటా కొత్త పత్తి ధర రూ.8,614గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 28న సోమవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.250, నాన్ ఏసీ మిర్చి ధర రూ.200, కొత్త పత్తి రూ.236 తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు.



