జర్నలిస్టుల ఇళ్ల సమస్య.. పరిష్కారం కావాలి!

సిద్దిపేట జిల్లాలో జర్నలిస్టుల ఇళ్ల సమస్య తెరపైకి వచ్చింది. TJEA జిల్లా అధ్యక్షుడు ఎస్. ఆంజనేయులు సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్‌ను కలిశారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించాలని వినతిపత్రం ఇచ్చారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కె. సత్యనారాయణ, వంగ రాజు, బి. లింగమూర్తి, సిహెచ్. మహేందర్, లింగాల బాబు పాల్గొన్నారు.



