డుంబ్రిగుడలో SMC ఎన్నికలు.. ప్రశాంతం!

అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం సాగర పంచాయతీ సున్నంమెట్ట గ్రామంలో SMC ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చైర్మన్‌గా గెమ్మెలి తౌడన్న, వైస్‌చైర్మన్‌గా గెమ్మెలి సుమిత్ర ఎన్నికయ్యారు. ప్రధానోపాధ్యాయులు గెమ్మెలి రాంప్రసాద్ నూతన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. పాఠశాల అభివృద్ధికి SMC సభ్యులు కృషి చేయాలని సూచించారు.



