పెట్రోలింగ్ వాహన డ్రైవర్ రాకేష్ మృతి

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం పోలీస్ పెట్రోలింగ్ వాహన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ (22) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఇటీవల పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో రాకేష్ తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ NIMS ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. రాకేష్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతివార్తతో ఆయన స్వగ్రామమైన కాకరవాయి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



