రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి

పోలవరం జిల్లా చింతూరు మండలం పోతనపల్లి సమీపంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సుకుమామిడికి చెందిన పల్లాల రమణారెడ్డి చింతూరులో కాఫీ షాపు నిర్వహిస్తున్నారు. ఆయన బైక్‌పై సొంత గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. చూటూరుకు చెందిన పాయం అశోక్ బైక్‌పై రాజమండ్రి వైపు వెళుతుండగా ఢీకొన్నాయి. రమణారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. అశోక్‌ను చింతూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.


