ఎస్ఎంసీ ఎన్నికలపై ఆరోపణలు.. హొళగుందలో రసాభాస
కర్నూలు జిల్లా హొళగుంద జడ్పీ స్కూల్ ఎస్ఎంసీ ఎన్నికలపై వివాదం. నిబంధనలు పాటించలేదని, ఏకపక్షంగా జరిగాయని తల్లిదండ్రుల ఆరోపణ. కోరం లేకుండా పేర్లు ప్రకటించారని నిరసన. సమావేశాన్ని బహిష్కరించారు. తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చారు.. ఎన్నికలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కన్నారావు, ఎమ్మార్పీఎస్ వెంకటేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.



