టిబెట్‌లో మళ్లీ భూకంపం

ఇవాళ టిబెట్‌లో భారీ భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదు అయినట్లు EMSC చెప్పింది. భూమికి 35 కిలోమీటర్ల లోతులో ఈ కంపనం మొదలైంది. అయితే మన దేశపు National Center for Seismology మాత్రం దీని తీవ్రత 5.0 అని తెలిపింది. ఈ ప్రభావంతో పక్కనే ఉన్న నేపాల్‌లోనూ భూమి కంపించింది. దాంతో జనాలు భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.



