← Back to news

మినిమం ఫెసిలిటీస్ కోసం నిరసన

By Sagar· 1h ago· Ramagundam, Ramagundam, Peddapalli
మినిమం ఫెసిలిటీస్ కోసం నిరసన

పెద్దపల్లి జిల్లా రామగుండం 32వ డివిజన్ అంబేద్కర్ నగర్ ప్రజలు మౌలిక సౌకర్యాల కోసం నిరసన తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే వీధులు బురదమయ్యాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు నడవలేకపోతున్నారు. నీరు నిలిచి దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వ్యాధులు వస్తున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పరిష్కారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.

More in Local