50 వేల కిలోల చెత్తతో.. వరల్డ్ రికార్డు

మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని 170 స్కూళ్లకు చెందిన 35,147 మంది విద్యార్థులు ‘స్వచ్ఛ పాఠశాల’ ప్రోగ్రామ్‌లో కలిసికట్టుగా దాదాపు 50 వేల కిలోల చెత్తను సేకరించారు. 'స్వచ్ఛతా హీ సేవ–2026'లో భాగంగా చేపట్టిన ఈ గ్రేట్ వర్క్‌కి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. నిడమర్రు ZP స్కూల్‌లో అధికారులు ఈ రికార్డు సర్టిఫికెట్‌ను కమిషనర్ షేక్ అలీమ్ బాషాకు అందించారు. పిల్లలకు చెత్త వేర్పాటుపై మంచి అవేర్‌నెస్ కూడా ఇచ్చారు.



