నేటి జంతర్ మంతర్ నిరసనపై CPI(M) స్పందన

అక్టోబర్ 2న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర SIRకు వ్యతిరేకంగా యువత, విద్యార్థులు నిరసనకు దిగారు. CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. DYFI, SFIతో పాటు మరికొన్ని సంఘాలు నిరసనలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వందల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని CPI(M) తెలిపింది. నిరసనకు అనుమతి ఇవ్వకపోవడాన్ని కూడా ఆ పార్టీ తప్పుబట్టింది. అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.