ACBకి చిక్కిన GPO

TG: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో గ్రామ పరిపాలన అధికారి (GPO) రాజేష్ రూ.5 వేల లంచం తీసుకుంటూ ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. పాస్‌బుక్‌లో తప్పుగా నమోదైన పేరును సరిచేయాలంటే రూ.5వేల లంచం ఇవ్వాలని గ్రామానికి చెందిన మల్లేష్‌ను డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచనల మేరకు లంచం ఇస్తుండగా ముందుగా మాటువేసిన అధికారులు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



