100 క్వింటాళ్లకు మించి పత్తి తీసుకురావద్దు

ఒక్క రైతు రోజుకు 100 క్వింటాళ్లకు మించి పత్తి తీసుకురావద్దని కలెక్టర్ రాజర్షి సూచించారు. అంతకంటే ఎక్కువ ఉంటే మరుసటి రోజు విక్రయించుకోవాలని తెలిపారు. పత్తి కొనుగోళ్ల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్లాట్ బుకింగ్ గడువును 7 నుంచి 14 రోజులకు పెంచినట్లు చెప్పారు. తేమ నిబంధనలు, రైతు రిజిస్ట్రీ ఆధారంగా స్లాట్ బుకింగ్‌పై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.



