తెలుగులో ఫూలన్ దేవి ఆత్మకథ

రాజకీయ నాయకురాలైన ఒకప్పటి బందిపోటు దివంగత ఫూలన్ దేవి ఆత్మకథను తెలుగులోకి అనువదించారు నవత. దాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. ఆమె చిన్నతనంలో పేదరికం, కులవ్యవస్థ, బాల్య వివాహం వల్ల ఎదురైన చేదు అనుభవాలను ఈ పుస్తకంలో వివరించారు. దాడులు, అవమానాలు, అణచివేతను ఎదుర్కొని ఆమె బందిపోటుగా మారిన విషయాలను వివరంగా ఇందులో రాశారు. అనంతరం ఆమె ఎంపీ అయ్యేవరకూ సాగిన ప్రస్థానాన్ని ఇందులో వివరించారు. పుస్తకం ధర 275 రూపాయలు. కొనే <a href="https://amzn.in/d/01uBwf7E">లింక్</a>.



