సెక్షన్ 22Aతో భూయజమానులకు ఇబ్బంది

రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A కింద ప్రభుత్వం, ఎండోమెంట్, వక్ఫ్, అసైన్డ్, సీలింగ్ సర్ప్లస్ భూములను నిషేధిత జాబితాలో పెట్టడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వేలాది ప్రైవేట్ భూయజమానులు ఇబ్బందులు పడుతున్నారు. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు ఈ జాబితాలోని సర్వే నంబర్లపై సేల్, గిఫ్ట్, తనఖా డాక్యుమెంట్లు రిజిస్టర్ చేయడం లేదు. చాలా చోట్ల మొత్తం సర్వే నంబర్‌ను జాబితాలో పెట్టడంతో లీగల్ పట్టా భూములు, లేఅవుట్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు ఈ జాబితాలో చేరిపోయాయి.



