← Back to news

పిల్లలకు సోషల్ మీడియా.. నిషేధానికి 27 దేశాలు రెడీ!

By Anusha· 2d ago
పిల్లలకు సోషల్ మీడియా.. నిషేధానికి 27 దేశాలు రెడీ!

చిన్నారుల సోషల్ మీడియా వాడకంపై 27 దేశాలతో కూడిన ఐరోపా సమాఖ్య(EU) ఆంక్షలకు సిద్ధమవుతోంది. 13 ఏళ్లలోపు పిల్లలకు SM వాడకం నిషేధించాలని ప్రపోజ్ చేసింది. 13–15 ఏళ్ల వారికి సంరక్షకుల పర్యవేక్షణలో పరిమిత ఫీచర్లతో అకౌంట్స్ అనుమతించాలని, 15–18 ఏళ్ల వారికి ప్లాట్‌ఫామ్‌లు ప్రత్యేక సురక్షిత డిజైన్‌ను అందించాలని సూచించింది. వ్యసనానికి దారితీసే ఫీచర్లు, ఏఐతో అసభ్య చిత్రాల సృష్టి నుంచి పిల్లలను రక్షించడమే లక్ష్యమని ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ తెలిపారు.

More in International