← Back to news

రెండు కార్లు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

By Bala· 1d ago

వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రం శివారులో వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కూడలి దేవి ఆలయం సమీపంలో అతివేగంతో వచ్చిన కార్లు అదుపుతప్పి ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

More in Local