స్టూడెంట్స్‌కు EMIలో డ్రగ్స్ అమ్ముతున్న టీచర్లు

కేరళలో కోజికోడ్‌లోని పెరంబ్రా బ్లాక్ రిసోర్స్ సెంటర్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విచారణ జరిపింది. ఇందులో గవర్నమెంట్ టీచర్లు డ్రగ్స్ ఏజెంట్లుగా ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో రెండు రోజుల క్రితం ఇద్దరు టీచర్లు పోలీసులు అరెస్టు చేయగా, ఈరోజు ఇంకో టీచర్ను అరెస్ట్ చేశారు. స్టూడెంట్స్‌కు EMI పద్ధతిలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. ఒకవైపు విద్యార్థుల్లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవేర్నెస్ కల్పిస్తూ, మరోవైపు వారికే డ్రగ్స్ అమ్మడం గమనార్హం.



