← Back to news

హత్య చేసి..శవంతో సెల్ఫీలు దిగారు

By Vishi· 7 Aug 2026· Indiatimes· Tamilnadu
హత్య చేసి..శవంతో సెల్ఫీలు దిగారు

మందు తాగొద్దని, పనికి వెళ్లమని హెచ్చరించినందుకు కోయంబత్తూరు జిల్లా సిక్కలంపాళయంలో ఎస్.అశ్విన్‌(22) అనే కూలీని ఇద్దరు యువకులు హత్య చేశారు. 21 ఏళ్ల మథేష్, మరొక 16 ఏళ్ల యువకుడు కత్తి, కొడవలి, సుత్తితో దాడి చేసి చంపారు. హత్యను వీడియో తీసి, శవంతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాయి.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 8h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.