← Back to news

'ఫార్ములా-ఈ రేస్' కేసులో KTRకు ACB కోర్టు కీలక ఆదేశాలు

By Mahesh· 31 Jul 2026
'ఫార్ములా-ఈ రేస్' కేసులో KTRకు ACB కోర్టు కీలక ఆదేశాలు

TG: ఈరోజు నాంపల్లి ACB స్పెషల్ కోర్టులో ఫార్ములా-ఈ రేస్ కేసు విచారణ జరిగింది. ACB నోటీసులలో కేటీఆర్‌ ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డి హాజరయ్యారు. కార్ రేస్ నిర్వహణ వల్ల HMDAకు రూ.54.88 కోట్ల నష్టం వాటిల్లిందని చార్జ్‌షీట్‌లో ఏసీబీ పేర్కొంది. చార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుని, విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. కేటీఆర్ రూ.1 లక్ష పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశించింది.

More in Legal