ప్రైవేట్ స్థలంలో జరిగే అవమానాలకు SC/ST చట్టం వర్తించదు

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (నివారణ) అత్యాచారాల చట్టం కింద జరిగే అవమానాలు లేదా కులం పేరుతో దూషించడం కేవలం ‘Public View’లో జరిగితేనే నేరంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేట్ గదిలో లేదా నాలుగు గోడల మధ్య, ప్రజలు లేని చోట జరిగితే ఈ చట్టం వర్తించదని క్లారిటీ ఇచ్చింది. 2020లో ఒక స్కూల్ మేనేజర్‌పై నమోదైన కేసులో నేరంగా జరిగిన ప్రాంతం ప్రైవేటు స్థలం అని, అక్కడ ఎవరూ లేరని తెలిపింది. దీనిపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను రద్దు చేసింది.


