← Back to news

దాచేపల్లిలో అంతరాష్ట్ర కరాటే పోటీలు ప్రారంభం

By siva· 2h ago
దాచేపల్లిలో అంతరాష్ట్ర కరాటే పోటీలు ప్రారంభం

AP: పల్నాడు జిల్లా దాచేపల్లిలో అంతరాష్ట్ర కరాటే పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గురజాల నియోజకవర్గ యువనేత యరపతినేని నిఖిల్ పోటీలను ప్రారంభించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనడం ముఖ్యమన్నారు. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పోటీలకు హాజరయ్యారు. కార్యక్రమంలో కరాటే పోటీల చీఫ్ ఆర్గనైజర్ నరసింహారావు, టోర్నమెంట్ ఇన్‌చార్జీలు పార్వతి, నవ్యశ్రీ, ఆర్గనైజర్ లక్ష్మణ్ సాయి, కొప్పుల గిరి, అంబటిమల్లి, కొప్పుల నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

More in Local