బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో కలెక్టర్ నిషాంతి టి. మాట్లాడుతూ, బాలికల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాలు పెంచేందుకు ఆత్మరక్షణ శిక్షణ దోహదపడుతుందని తెలిపారు. జిల్లాలో 166 ప్రభుత్వ పాఠశాలల్లో 6-12 తరగతి బాలికలకు శిక్షణ ఇస్తున్నారు. నాలుగు నెలల్లో 30 సెషన్లు జరుగుతాయి. ప్రమాదాలను ముందుగా గుర్తించి అప్రమత్తంగా స్పందించేలా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.



