దివ్యాంగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం: కురుమయ్య

వనపర్తి జిల్లా గణపురం మండల NPRD నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు మధు, మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బద్గని కురుమయ్యను మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కురుమయ్య మాట్లాడుతూ.. దివ్యాంగుల హక్కుల సాధన, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, హక్కులు ప్రతి దివ్యాంగుడికి అందేలా కృషి చేస్తామని చెప్పారు.




