రోడ్డు పనులకు MLA శంకుస్థాపన

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో 42 లక్షలతో నిర్మించనున్న కొత్త CC రోడ్డు పనులకు రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ గురువారం శంకుస్థాపన చేశారు. చిక్కాల దేవానంద్ ఇంటి నుంచి లంకాలమ్మ గుడి వరకు ఈ రహదారిని నిర్మించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని MLA తెలిపారు. రహదారి నిర్మాణంతో గ్రామస్తులతో పాటు లంకాలమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు రాకపోకలు సులభతరం అవుతాయని చెప్పారు.



