నెల రోజులకే పెళ్లి బంధం విషాదం

AP: గుంటూరుకు చెందిన శాంతి(26)కి సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం పోతుకుంటకు చెందిన మహేష్(33)తో నెలరోజుల క్రితం వివాహమైంది. మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన వీరు అనంతపురంలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా శాంతి రక్తపు మడుగులో మృతిచెంది కనిపించింది. తలపై రోకలిబండతో దాడిచేసి హత్య చేసినట్లు గుర్తించారు. రెండురోజుల క్రితమే హత్య జరిగి ఉండొచ్చని తెలిపారు. మహేష్ పరారీలో ఉన్నాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



