← Back to news

ISROలో 410 అప్రెంటిస్ జాబ్స్

By Mahesh· 1 Aug 2026
ISROలో 410 అప్రెంటిస్ జాబ్స్

ISROలో జాబ్ చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. బెంగళూరులోని U.R రావు శాటిలైట్ సెంటర్‌లో 410 అప్రెంటిస్ పోస్టులకు అప్లికేషన్స్ మొదలయ్యాయి. ఈ నోటిఫికేషన్‌లో గ్రాడ్యుయేట్స్‌కు 220, టెక్నీషియన్స్‌కు 120, కమర్షియల్ అప్రెంటిస్‌కు 70 పోస్టులున్నాయి. డిగ్రీ, డిప్లొమా, కామర్స్ అర్హత కలిగిన కాండిడేట్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశముంది. కాండిడేట్లు NATS వెబ్‌సైట్‌లో ఆగస్ట్ 28 వరకు ఆన్‌లైన్‌లో <a href="https://nats.education.gov.in/">అప్లై </a>చేసుకోవచ్చు.

More in Jobs