కడపలో భారీ ఖనిజ నిక్షేపాలపై ఫోకస్

AP: కడప బేసిన్‌లో కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేంపల్లి, వేముల ప్రాంతాల్లో లిథియం, గాలియం నిక్షేపాలపై పరిశోధనలు నిర్వహించేందుకు రాష్ట్ర గనులశాఖ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. CM చంద్రబాబు సమక్షంలో ఒప్పంద ప్రక్రియ పూర్తయింది. ఇదే సమయంలో గనుల రంగంలో పరిశోధన, ఆధునిక సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి కోసం ధన్‌బాద్ ఐఐటీతో మరో ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో గనుల రంగానికి సంబంధించిన సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.



