ప్రకృతి వ్యవసాయ మోడల్స్‌పై ఇంటర్నేషనల్ టీమ్ స్టడీ

ఏలూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించేందుకు ఇండోనేషియా, థాయిలాండ్‌కు చెందిన 11 మంది సభ్యుల అంతర్జాతీయ ప్రతినిధి బృందం పర్యటించింది. APCNF ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు జరుగుతున్న పర్యటనలో భాగంగా ఉంగుటూరు, భీమడోలు ప్రాంతాల్లోని పలు గ్రామాలను సందర్శించారు. వెల్లమిల్లిలో ఫిష్ పేడీ IFS మోడల్, Raised Bund Paddy, ముర్రెల్ చేపల పెంపకాన్ని పరిశీలించారు. గోకవరంలో కొబ్బరి, కోకో, వక్క, పసుపు, కంద పంటలను పరిశీలించారు.



