రోడ్డు కోసం గ్రామస్థుల ఆందోళన
TG: వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలో సుమారు 30 మీటర్ల రహదారి పనులు పూర్తికాకపోవడంతో గ్రామస్థులు ధర్నాకు దిగారు. రెండు గంటలపాటు ఆందోళన చేసినా గ్రామ సర్పంచ్ సమస్య పరిష్కారానికి హాజరుకాకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లలో గ్రామంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని తెలిపారు. అధికార పార్టీ, ఎమ్మెల్యే, ప్రభుత్వం ఉన్నా చిన్న సమస్య పరిష్కారానికి ప్రజలు ధర్నా చేయాల్సి రావడం బాధాకరమన్నారు. పోలీసులు వచ్చి ధర్నా విరమింపజేశారని వార్డు సభ్యుడు బక్కి శివకృష్ణ తెలిపారు.



