రెండిళ్ల మధ్య కొట్లాట.... డ్రమ్ములతో రోడ్డు బ్లాక్..
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మహేంద్ర నగర్ కాలనీలో రెండు కుటుంబాల మధ్య రెండు మూడేళ్లుగా మనస్పర్ధలు ఉన్నాయి. ఈ గొడవల వల్ల డ్రమ్ముల్లో ఇసుక పోసి రోడ్డుకు ఇరువైపులా పెట్టారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. అడిగిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని, కొట్టడానికి వెళ్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు.



