← Back to news

భార్యాభర్తల హత్య వెనుక ఇద్దరు కానిస్టేబుళ్లు

By dk· 14 Aug 2026· సూర్యాపేట జిల్లా
భార్యాభర్తల హత్య వెనుక ఇద్దరు కానిస్టేబుళ్లు

TG: సూర్యాపేట జిల్లా మోతె మండలంలో భార్యాభర్తలు బూబా, నాగులు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటనలో మోతె PSకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు షరీఫ్‌, సుందరయ్యల ప్రమేయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బూబాతో షరీఫ్‌కు వివాహేతర సంబంధం ఉండడంతో ఆమె కుమార్తె వివాహానికి షరీఫ్ రూ.3లక్షలు అప్పుగా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమె డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం, తమ సంబంధాన్ని బయటపెడతానని బూబా బెదిరించింది. దీంతో షరీఫ్, సుందరయ్య భార్యాభర్తలపై రాడ్‌‌తో దాడిచేసి హత్య చేసినట్లు పేర్కొన్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 7h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.