హుషారు 2.. సీక్వెల్ వచ్చేస్తోంది!

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘హుషారు’కు సీక్వెల్‌గా ‘హుషారు 2’ వస్తోంది. మొదటి సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీ హర్ష కొణుగంటి ఈ మూవీని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. అశోక్ గల్లా, రాహుల్ రామకృష్ణ, రవి ఆంథోనీ, దినేశ్ తేజ్, శశిధర్ కొచర్లకోట కీ రోల్స్‌లో కనిపించనున్నారు. ఐదుగురు ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే కొత్త కథతో సినిమా తయారవుతోంది. లక్కీ మీడియా బ్యానర్‌పై ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు


