← Back to news

చేతికొచ్చిన పంటను నాశనం చేసిన దుండగులు

By Srikanth· 2h ago· Jagitial

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్‌పేటలో దారుణం జరిగింది. రైతు మాధవరెడ్డికి చెందిన 16 గుంటల వరి పంటపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు గడ్డి మందు పిచికారీ చేశారు. ఈ దృశ్యాలు CC కెమెరాల్లో రికార్డయ్యాయి. పంట ఎండిపోవడంతో 50 వేల రూపాయల నష్టం జరిగిందని, గతంలోనూ తనను వేధించారని రైతు తెలిపారు. దీనిపై పోలీసులకు కంప్లైంట్ చేసి న్యాయం చేయాలని కోరుతున్నాడు.

More in Local