ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్స్

త్వరలో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ల నేతృత్వంలోని సీనియర్ అధికారుల టీమ్స్ ఈ వారం నుంచి ఆయా రాష్ట్రాల్లో పర్యటించనున్నాయి. మొదటగా ఈ వారం గోవాలో, వచ్చే వారం ఉత్తరాఖండ్‌లో ఈ టీమ్స్ పర్యటిస్తాయి. ఆ తర్వాత పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలకు వెళ్లనున్నాయి. గ్రౌండ్ లెవెల్‌లో ఎన్నికల సన్నాహాలు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఈ బృందాలు నేరుగా పర్యవేక్షించనున్నాయి.

