పెద్దపులి మృతి కేసులో బిగ్ ట్విస్ట్

AP: మార్కాపురం జిల్లా గిద్దలూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. గిద్దలూరుకు చెందిన అంజి, నంద్యాల జిల్లాకు చెందిన వీరాంజనేయులను గుంటూరు జిల్లా మేడికొండూరులో అదుపులోకి తీసుకున్నారు. 20రోజుల క్రితం ఉచ్చులో చిక్కి మృతి చెందిన పెద్దపులి కాళ్లు నరికి గోళ్లు తీసుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి పారదర్శక దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.



