కోర్టుకు వెళ్లకుండానే కేసులు క్లోజ్!

TG: తెలంగాణలో 2023 నుంచి 20 యాంటీ కరప్షన్ బ్యూరో కేసులు క్లోజ్ అయినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ తెలిపింది. లంచం తీసుకుంటూ ACBకి పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా.. డిపార్ట్‌మెంటల్ ఎంక్వయిరీకే పరిమితం చేసినట్లు ఈ రిపోర్ట్ చెబుతుంది. దీంతో కొన్ని కేసులు కోర్టుకు వెళ్లకముందే ముగిశాయి. దీనిపై ACB అధికారుల్లో అసంతృప్తి ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది.


