స్వచ్ఛ మంగళగిరి–స్వచ్ఛ పాఠశాల
ఉండవల్లిలో MTMC ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ మంగళగిరి–స్వచ్ఛ పాఠశాల’ డ్రైవ్ జరిగింది. వంశీ హైస్కూల్, జవహర్ విద్యానికేతన్, ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు ప్లాస్టిక్, పాత బుక్స్, కార్డ్‌బోర్డులు సేకరించి చెత్త వేర్పాటు, రీసైక్లింగ్ గురించి తెలుసుకున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నేతలు జంగాల వెంకటేష్, వంగ నరేంద్ర, లింగం శెట్టి కిషోర్ కుమార్, యర్రం శెట్టి రాము విద్యార్థులను మెచ్చుకున్నారు. స్కూల్ పరిసరాలను నీట్‌గా ఉంచుకోవడం అందరి రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు.



