గ్రీస్‌లో అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి?

సన్ రైజర్స్ హైదరాబాద్ CEO కావ్య మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ నవంబర్ 10న గ్రీస్‌లో వివాహం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై వీరిద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల అనిరుధ్ మేనమామ వై.జి. మహేంద్రన్ ఒక ఇంటర్వ్యూలో అనిరుధ్‌కి త్వరలోనే పెళ్లి జరగనుందని చెప్పడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



