మరో ఘోరమైన రోడ్డు ప్రమాదం!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు, అకస్మాత్తుగా ఎదురొచ్చిన బైకర్‌ను తప్పించబోయి అదుపు తప్పింది. ఈ క్రమంలో రెండు బైకులను, రోడ్డు పక్కన ఉన్న వ్యక్తులను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



