మేనేజర్లకు గుడ్‌బై.. రేపు వాళ్ల కోసమే వెతుకులాటా?

ఖర్చులు తగ్గించేందుకు, AIతో పనులు తొందరగా చేసేందుకు Uber, Intel, Coinbase వంటి కంపెనీలు మిడిల్ మేనేజర్ల పోస్టులను తగ్గిస్తున్నాయి. అయితే ఉద్యోగులు, సీనియర్ అధికారుల మధ్య బ్రిడ్జిలా ఉండే వీరి అవసరం ఫ్యూచర్‌లో మళ్లీ పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. Georgetown University అంచనా ప్రకారం 2032 నాటికి అమెరికాలో 29 లక్షల మేనేజర్ల కొరత ఏర్పడొచ్చు. AI కోఆర్డినేషన్ పనులు చేసినా టీమ్ లీడర్‌షిప్, మోరేల్ లాంటి మానవ అంశాలను పూర్తిగా భర్తీ చేయడం కష్టమే.



