← Back to news

VLTD ఉంటేనే బండి రిజిస్ట్రేషన్.. భద్రతకు కేంద్రం చర్యలు

By Vishi· 23 Aug 2026
VLTD ఉంటేనే బండి రిజిస్ట్రేషన్.. భద్రతకు కేంద్రం చర్యలు

ప్రయాణికులు, స్కూల్ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రవాణా వాహనాలు ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ కావాలంటే VLTD(Vehicle Location Tracking Device) తప్పనిసరి చేసింది. ఏఐఎస్-140 ప్రమాణాలకు అనుగుణంగా తయారైన ఈ పరికరం ప్యానిక్ బటన్‌తో ఉండాలి. దీనికి ఎలాంటి మినహాయింపులు గానీ, గడువు పెంపు గానీ ఉండవని కేంద్ర రవాణా శాఖ స్పష్టం చేసింది.

More in Current Affairs